తమిళ నేలపై అజిత్ సినిమా విధ్వంసం.!

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన అవైటెడ్ సాలిడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రమే “గుడ్ బ్యాడ్ అగ్లీ”. అజిత్ ఫ్యాన్ దర్శకుడు అధిక్ రవి చంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం అజిత్ కెరీర్లో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. ఒక్క తమిళనాడు లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అజిత్ కెరీర్లో హైయెస్ట్ దగ్గరకి కేవలం ఈ 5 రోజుల్లోనే రీచ్ అయ్యిపోయింది.

ఇక తమిళ నేలపై అయితే మినిమమ్ రోజుకి 20 కోట్ల గ్రాస్ యావరేజ్ తో కొనసాగడం అజిత్ స్టార్డంని చూపిస్తుంది అని చెప్పాలి. ఇలా కేవలం ఈ 5 రోజుల్లోనే తమిళనాడులో గుడ్ బ్యాడ్ అగ్లీ ఏకంగా 100 కోట్ల మార్క్ ని టచ్ చేసినట్టుగా పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో తమిళ నేలపై అజిత్ విధ్వంసం గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. అలాగే లాంగ్ రన్ ఎక్కడ ఆగుతుందో కూడా చూడాలి మరి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించగా జీవి ప్రకాష్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

Exit mobile version