విజయ్ “గోట్” లో అజిత్.. అజిత్ సినిమాలో విజయ్

విజయ్ “గోట్” లో అజిత్.. అజిత్ సినిమాలో విజయ్

Published on Aug 31, 2024 8:01 AM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర క్రేజీ మల్టీస్టారర్ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లపై ఓ సినిమా పడితే చూడాలని చాలా మందికి ఉంది. మరి ఇలానే తమిళ్ సినిమా దగ్గర థలా అజిత్ అలాగే దళపతి విజయ్ ల కాంబినేషన్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే వీరిద్దరిపై మల్టీస్టారర్ చేస్తాను అని చెప్పే దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

ఇప్పుడు తాను విజయ్ తో చేసిన గోట్ సినిమాలో అజిత్ సర్ రిఫరెన్స్ ఉంటుంది అని ఫ్యాన్స్ కి ఊహించని కిక్ ఇచ్చాడు. అలాగే ఇది మంచి సర్ప్రైజింగ్ గా ఉంటుంది అని అలాగే మరోపక్క అజిత్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాలో విజయ్ రిఫరెన్స్ ఉంటుంది అని కోలీవుడ్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ ని అందించాడు. దీనితో ఈ కామెంట్స్ ఫ్యాన్స్ ని మంచి ఎగ్జైట్మెంట్ లోకి మార్చేశాయి. మరి ఇవి సినిమాలో ఎలా ఉంటాయో వాటికి ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు