అజిత్ “విడా ముయార్చి” షూటింగ్ లేటెస్ట్ అప్డేట్!

అజిత్ “విడా ముయార్చి” షూటింగ్ లేటెస్ట్ అప్డేట్!

Published on Jul 22, 2024 12:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తదుపరి యాక్షన్ ఎంటర్టైనర్ విడా ముయార్చిలో కనిపించనున్నాడు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అజిత్ కుమార్ కి సంబందించిన ఫస్ట్ మరియు సెకండ్ లుక్ పోస్టర్లు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా అజిత్ మరియు ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న త్రిష కృష్ణన్ లకి సంబందించిన పోస్టర్ ను రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పై మేకర్స్ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది. అజర్ బైజాన్ కీలక షెడ్యూల్ ను టీమ్ పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అర్జున్, రెజీనా కసాండ్రా మరియు ఆరవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు