ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజిత్ “పట్టుదల”

ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజిత్ “పట్టుదల”

Published on Mar 3, 2025 12:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “విడా ముయర్చి”. అజిత్ తో దర్శకుడు మగిళ్ తిరుమనేని తెరకెక్కించిన ఈ సినిమా చాలా కాలం లేట్ అయ్యేసరికి థియేటర్స్ లో పెద్దగా రాణించలేదు. ఓపెనింగ్స్ అయితే దక్కాయి కానీ మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడంతో తమిళ్ లో సైతం ఈ చిత్రం తేలిపోయింది.

ఇక తెలుగులో “పట్టుదల” పేరిట రిలీజ్ అయ్యిన ఈ చిత్రానికి తెలుగులో కూడా అదే పరిస్థితి కనిపించింది. ఇక ఎట్టకేలకి ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం చేసుకోగా అందులో ఒరిజినల్ తమిళ్ సహా డబ్బింగ్ తెలుగు ఇతర ముఖ్య భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఇపుడు ఓటిటిలో ట్రై చేయాలి అనుకుంటే ఇపుడు ఇందులో చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

c

సంబంధిత సమాచారం

తాజా వార్తలు