అజిత్ “తునివు” రిలీజ్ పై కోలీవుడ్ లో ఆసక్తి..!

Published on Sep 23, 2022 12:52 am IST


తమిళ సినిమా దగ్గర భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో అజిత్ కుమార్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ లెవెల్ లో తన క్రేజ్ కానీ సినిమాల వసూళ్లు కానీ నమోదు అవుతాయి. ఇక తాను నటిస్తున్న లేటెస్ట్ సినిమా నుంచి నిన్ననే టైటిల్ సహా ఫస్ట్ లుక్ కూడా బయటకి వచ్చాయి.

మరి ఈ చిత్రానికి “తునివు” అని టైటిల్ ని ఫిక్స్ చెయ్యగా అజిత్ పై ఒక సాలిడ్ అండ్ కూల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఇక్కడ నుంచి ఈ సినిమా రిలీజ్ పై కోలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం దాదాపు జనవరి రిలీజ్ ఉండొచ్చని కోలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.

అయితే జనవరిలో సంక్రాంతి కానుకగా అక్కడ మరో బిగ్ స్టార్ తలపతి విజయ్ నటిస్తున్న “వరిసు” ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. దీనితో ఈ రేస్ లో అజిత్ సినిమా కూడా వస్తుందా అని టెన్షన్ అందరిలో ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. అయితే ప్రస్తుతానికి అయితే అజిత్ సినిమా సంక్రాంతి బరిలో రాకపోవచ్చనే తెలుస్తుంది. జనవరి లాస్ట్ లో రిపబ్లిక్ డే సందర్భంగా ఉండే అవకాశం ఉందట మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :