తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం రెండు చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. విడా ముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలను ఆయన తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇందులో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా పూర్తయ్యిందని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
అయితే, ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి బరిలో రిలీజ్ కాదనే టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడమే దీనికి కారణంగా అభిమానులు చెబుతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి సంబంధించిన తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రోమియో పిక్చర్స్ దక్కించుకుందని మేకర్స్ వెల్లడించారు. అయితే, ఈ పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడం గమనార్హం.
ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష, అర్జున్ దాస్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.