లేటెస్ట్ : అజిత్ ‘తునీవు’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

లేటెస్ట్ : అజిత్ ‘తునీవు’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 5, 2022 9:20 PM IST

కోలివుడ్ స్టార్ యాక్టర్ అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తునీవు. యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో మంజు వారియర్ కీలక పాత్ర చేస్తుండగా సముద్రఖని, మమతి చారి, ప్రేమ్ కుమార్, అజయ్, వీర తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. బే వ్యూ ప్రాజక్ట్స్ ఎల్ ఎల్ పి, జీ స్టూడియోస్ సంస్థలపై ఎంతో భారీ ఎత్తున నిర్మితం అయిన తునీవు ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక ఈ మూవీ యొక్క అప్ డేట్ కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న అజిత్ ఫ్యాన్స్ కి కొద్దిసేపటి క్రితం మేకర్స్ సూపర్ అప్ డేట్ అందించారు. తునీవు నుండి యువ మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ ని డిసెంబర్ 9 న విడుదల చేస్తున్నట్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు మేకర్స్. చిల్లా చిల్లా అనే పల్లవితో సాంగ్ ఈ సాంగ్ ని జీబ్రాన్ అద్భుతంగా కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా తునీవు నుండి ఫస్ట్ సాంగ్ అప్ డేట్ తో అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దానిని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు