డీసెంట్ టీఆర్పీ రాబట్టిన బాలయ్య “అఖండ”


నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం అఖండ. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం మాత్రమే కాకుండా, 100 రోజుల వేడుక ను కూడా జరుపుకుంది. ఈ చిత్రం ఇటీవల స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. ఈ చిత్రానికి 13.3 డీసెంట్ టీఆర్పీ రావడం జరిగింది. ఈ చిత్రం లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతి బాబు మరియు శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం.

Exit mobile version