అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఒక్క సక్సెస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా ఫ్లాపులుగా మిగలడంతో, ఆయన లాస్ట్ మూవీ ‘ఏజెంట్’పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఆ సినిమాకు డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో అఖిల్ కొంత గ్యాప్ తీసుకుంటున్నాడు.
అయితే, ఇప్పుడు అఖిల్ ఒకేసారి రెండు ప్రాజెక్టులను తెరకెక్కించబోతున్నాడనే వార్త సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేగాక, ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో రానున్నాయట. అయితే, అఖిల్ భారీ బడ్జెట్‌తో రిస్క్ చేసే బదులు, మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమా చేస్తే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.
ఇక అఖిల్ తన నెక్స్ట్ చిత్రాలను యూవీ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో చేయనున్నాడు. మరి ఈ సినిమాలు ఎలాంటి కథలతో వస్తాయో.. అవి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో వేచి చూడాలి.