‘లెనిన్’గా అఖిల్ ఊరమాస్ ఎంట్రీ..!

‘లెనిన్’గా అఖిల్ ఊరమాస్ ఎంట్రీ..!

Published on Apr 8, 2025 5:21 PM IST

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘ఏజెంట్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కొంత గ్యాప్ ఇచ్చిన అఖిల్, ఈసారి సాలిడ్ ప్రిపరేషన్‌తో వస్తున్నాడు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తు్న్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో అఖిల్ హీరోగా నటిస్తున్నాడు.

నేడు(ఏప్రిల్ 8) అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘లెనిన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోలో అఖిల్ రఫ్ లుక్‌తో ఊరమాస్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో సాగే ప్రేమ కథకు యాక్షన్ జోడించి ‘లెనిన్’ మూవీగా రూపొందిస్తున్నారు. ఇక ఈ గ్లింప్స్‌లో అఖిల్ చెబుతున్న పవర్‌ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. రూరల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు