అక్కినేని అఖిల్ తన కొత్త సినిమా ‘ఏజెంట్’ కోసం అదిరిపోయే లుక్ లో మారిపోయాడు. భారీగా కండలు తిరిగిన దేహదారుడ్యంతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా తన ఏజెంట్ సినిమాలోని తన లుక్ ను రివీల్ చేస్తూ అఖిల్ తన బాడీని ప్రదర్శించాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అఖిల్ ఫ్యాన్స్ ఈ పిక్ ను షేర్ అండ్ లైక్స్ తో తెగ వైరల్ చేస్తున్నారు.
సైరా లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ కోసం అఖిల్ నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా ఇలా కండలు తిరిగిన బాడీతో మరీ వైల్డ్ గా కనిపిస్తున్నాడు. అఖిల్ ఫోజు కూడా భారీ రైడ్ కి సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.
ఈ సినిమాలోని అఖిల్ లుక్ ఈ సినిమాకి మంచి హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అఖిల్ రెండు వేరియేషన్స్ ఎలివేట్ అయ్యేలా రెండు లుక్స్ లో సాలిడ్ పర్శనాలిటీలో కనిపించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.