అఖిల్ సోలోగా దిగాలని అనుకుంటున్నాడా ?

Published on Jan 14, 2021 2:12 am IST

అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం రీస్టార్ట్ అయిన ఈ చిత్రం అన్ని పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ముందుగా ఈ జనవరి నెలలో సినిమాను విడుదలచేయాలని అనుకున్నారు. కానీ సంక్రాంతి రేస్ నుండి సినిమా తప్పుకుంది. కొత్తగా సమ్మర్ కానుకగా సినిమా విడుదల ఉంటుందని ప్రకటించారు. అన్ని పనులు పూర్తైనా సినిమా ఎందుకు వెనక్కు వెళుతోంది అంటే పోటీ వలనే అంటున్నారు.

ఈ సంక్రాంతికి వరుసగా ‘క్రాక్, మాస్టర్’ విడుదలవగా ఇంకా ‘రెడ్, అల్లుడు అదుర్స్’ చిత్రాలు రేపు 14వ తేదీన విడుదలకానున్నాయి. అసలే 50 శాతం ఆక్యుపెన్సీ, పైగా పెద్ద పోటీ అని తప్పుకుని ఉండవచ్చు. అలాగే ఫిబ్రవరిలో ‘ఉప్పెన, ఏ1 ఎక్స్ ప్రెస్’,మార్చిలో ‘రంగ్ దే, లవ్ స్టోరీ’. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, నాని ‘టక్ జగదీష్’ డబ్బింగ్ చిత్రం ‘కెజిఎఫ్ 2’ రానున్నాయి. అందుకే సోలోగా వేసవికి వస్తే బాగుంటుందని ప్లాన్ చేశారట నిర్మాతలు.

అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరికీ ఈమధ్య కాలంలో బలమైన హిట్ లేకపోవడంతో ఈ సినిమా ఫలితంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More