కౌ బాయ్ గెటప్ లో అక్కినేని హీరో.

Published on Aug 4, 2020 1:37 pm IST

యంగ్ హీరో అఖిల్ అక్కినేని అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హ్యట్ పెట్టుకొని చేతిలో గన్ తో కౌ బాయ్ గెటప్ లో ఉన్న బుల్లి అఖిల్ ఫోటో ఆసక్తికరంగా ఉంది. ఆ ఫోటో నేపథ్యంలోకి వెళితే, 2002లో మహేష్ టక్కరి దొంగ పేరుతో ఓ కౌ బాయ్ మూవీ చేశారు. ఆ మూవీ సెట్స్ కి వెళ్లిన అఖిల్ కౌ బాయ్ గెటప్ లోకి మారడం జరిగింది. ఇక బేబీ బాయ్ గా ఉన్నప్పుడే అఖిల్ సిసింద్రీ చిత్రం చేయడం జరిగింది. బేబీస్ డే అవుట్ అనే ఇంగ్లీష్ మూవీ స్ఫూర్తితో తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

హీరోగా మూడు సినిమాలు చేసిన అఖిల్ సరైన హిట్ అందుకోలేదు. కాగా ప్రస్తుతం అఖిల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నారు. 2021లో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనేది, నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More