యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కు యువ హీరో అఖిల్ అక్కినేని క్రికెట్ బ్యాట్ ను బహుమతిగా ఇచ్చాడు. తమన్ కు క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి. ఖాళీ దొరిక్కినప్పుడల్లా క్రికెట్ అడుతుంటాడు. అలాగే అఖిల్ కూడా మంచి క్రికెట్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ సెలబ్రెటీ క్రికెట్ లీగ్ లోకూడా ఆడుతున్నారు. ఇక అఖిల్ ఇచ్చిన ఈ గిఫ్ట్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు తమన్.
అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుండి యు.కె లో జరుగనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.
@AkhilAkkineni8 darling thanks soooooooooooooo much for the wonderful wonderful ♥️ gift love U for this @SpartanSportsAU #kevinpeterson #rhinovseries ?? pic.twitter.com/mvuEEcWb21
— thaman S (@MusicThaman) June 18, 2018