పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా పట్ల పవన్ అభిమానుల్లో ప్రత్యేక శ్రద్ధ ఉంది. అయితే ఈ సినిమా విషయంలో వినిపిస్తూ వచ్చిన రూమర్స్ లో పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ కూడా ఉన్నాడంటూ పలు రూమర్స్ వచ్చాయి.
అయితే ఇపుడు అకిరా ప్రెజెన్స్ ఓజి కోసం ఉందని కన్ఫర్మ్ అయ్యింది. అయితే సినిమాలో రోల్ గా కాకుండా సినిమా సంగీతంలో తనతో కలిసి వర్క్ చేస్తున్నాడు అని సంగీత దర్శకుడు థమన్ చెబుతున్నాడు. ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తాను కలిసి వర్క్ చేయనున్నట్టుగా తెలిపాడు. మరి అకిరా ఇది మ్యూజిక్ పరంగా చాలానే వర్క్ చేసాడు. మరి ఈ ఓజి కోసం ఎలా ఉంటుందో చూడాలి.