యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా టైటిల్‌తో ఈ చిత్రం వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనింగ్ అంశాలతో నింపేశారు. ఓ ఊరికి ఇంజినీర్‌గా వచ్చిన హీరోకు అక్కడి మనుషులు, పరిస్థితుల కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చాయనేది ఈ సినిమాలో మనకు చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో కామెడీకి పెద్దపీట వేసినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రదీప్‌తో పాటు కమెడియన్ సత్య తనదైన పంచులతో నవ్వులు తెప్పిస్తున్నాడు. ఇక దీపికా పిల్లి కూడా అందంగా కనిపిస్తోంది.
నితిన్-భరత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా రధాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏప్రిల్ 11న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.