సినీ పరిశ్రమకు అన్నీ మంచి రోజులే – అక్కినేని నాగార్జున

Published on Jan 19, 2022 12:37 am IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం “బంగార్రాజు”. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం రాజమహేంద్రవరంలో “బ్లాక్‌బస్టర్ మీట్” వేడుకను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ కరోనాతో ప్రపంచమంతా భయపడుతున్నా, సంక్రాంతికి రిలీజ్ అయిన “బంగార్రాజు” సినిమాను ఆదరించి సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికి నా పాదాభివందనాలు అని అన్నారు. ఇక ఇటీవల జరిగిన మెగాస్టార్‌ చిరంజీవి, సీఎం జగన్‌ల భేటీ గురించి తెలుసుకున్నానని, సినీ పరిశ్రమపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారని చిరంజీవి నాతో చెప్పారని, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులేనని నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :