ఫిబ్రవరి లో థియేటర్లలోనే రిలీజ్ కానున్న “అక్షర”

ఫిబ్రవరి లో థియేటర్లలోనే రిలీజ్ కానున్న “అక్షర”

Published on Jan 1, 2021 12:00 PM IST

నందితశ్వేతా లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘‘అక్షర”. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ: న్యూ ఈయర్ సందర్భంగా మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు హీరో అడివి శేష్ కు ముందుగా థాంక్స్. సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా మా ‘‘అక్షర’మూవీ’ రూపొందింది . ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజ‌ర్,సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం.ఇప్పుడు పరిస్థితులన్ని చక్కబడ్డాయి కాబట్టి ఫిబ్రవరి నెలలో థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నాం. ఎంటర్ టైన్మెంట్ ఎక్కడా మిస్ అవకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ సినిమాలో చర్చించబోతున్నాం. ” అన్నారు.

నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు