15 ఏళ్లలో అత్యంత త‌క్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న హీరో!

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టించిన తాజా చిత్రం ‘స‌ర్ఫిరా’ మంచి అంచ‌నాల మ‌ధ్య జూలై 12న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. త‌మిళ్ లో వ‌చ్చిన సూర‌రై పొట్రు(ఆకాశ‌మే నీ హ‌ద్దురా)కు రీమేక్ గా ఈ సినిమా వ‌చ్చింది. లేడీ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఖ‌చ్చితంగా హిట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేసింది.

క‌ట్ చేస్తే, రిలీజ్ రోజున స‌ర్ఫిరా చిత్రం అతి దారుణ‌మైన ఓపెనింగ్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన‌ట్లుగా మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త 15 ఏళ్ల‌లో అక్ష‌య్ కుమార్ న‌టించిన సినిమాల్లో ఇదే అత్యంత త‌క్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. స‌ర్ఫిరా మూవీ ఓపెనింగ్ రోజున రూ.2.40 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఆయ‌న గ‌త చిత్రం ‘బ‌డే మియా చోటే మియా’ ఓపెనింగ్ రోజున రూ.16 కోట్లు రాబ‌ట్ట‌డం విశేషం.

ఇక 2009లో ‘8×10 తస్వీర్’ చిత్రం రూ.1.80 కోట్ల ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. అక్ష‌య్ కుమార్ ఇక‌నైనా రీమేక్ సినిమాలు మానేసి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాల‌ని ఆయ‌న అభిమానులు కోరుతున్నారు.

Exit mobile version