ఓటిటి సమీక్ష: “స్కై ఫోర్స్” – హిందీ చిత్రం ప్రైమ్ వీడియోలో ప్రసారం

ఓటిటి సమీక్ష: “స్కై ఫోర్స్” – హిందీ చిత్రం ప్రైమ్ వీడియోలో ప్రసారం

Published on Mar 23, 2025 10:28 PM IST

Sky Force Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అక్షయ్ కుమార్, వీర్ పహార్య, సారా అలీఖాన్, శరద్ కేలేకర్, నిమ్రత్ కౌర్ తదితరులు.

దర్శకత్వం : సందీప్ కెవ్లాని, అభిషేక్ అనీల్ కపూర్

నిర్మాణం : మాడాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్, జియో స్టూడియోస్

సంగీతం : తనిష్క్ బాగ్చి, జస్టిన్ వర్గేసి

సినిమాటోగ్రఫీ : సంతాన కృష్ణన్ రవిచంద్రన్

ఎడిటర్ : ఏ శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్ సినిమా దగ్గర ఇటీవల వచ్చిన చిత్రాల్లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన చిత్రం “స్కై ఫోర్స్” ఒకటి. అయితే ఈ జనవరి గణతంత్ర దినోత్సవం కానుకగా వచ్చిన ఈ చిత్రంలో హిందీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గర విఫలం అయ్యింది. ఇక ఇటీవల ఓటిటిలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

1947 స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ కి భారత్ కి నడుమ కాశ్మీర్ గొడవలు మరింత పెరుగుతూ వస్తుంటాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ తరచూ భారత్ పై దాడులు చేయడం జరుగుతుంది. ఇలా తమకి యూఎస్ నుంచి కొన్ని అధునాతన వైమానిక సపోర్ట్ ఉందని భారత్ ని ఛాలెంజ్ కూడా చేస్తారు. ఇలా 1971 సమయంలో భారత్ వైమానిక దళంపై ఆకస్మికంగా పాకిస్తాన్ జరిపిన దాడులకు సమాధానంగా స్కై ఫోర్స్ మెషిన్ పేరిట కెప్టెన్ కుమార్ ఓం ఔజా (అక్షయ్ కుమార్) తన బృందంతో కలిసి అటాక్ ప్లాన్ చేస్తాడు. అయితే తన టీంలో ఎంతో అనుభవం కలిగిన టైగర్ స్క్వాడ్రన్ పైలెట్ టాబ్బీ గా పిలవబడే టీ కే విజయ (వీర్ పహార్య) ని మాత్రం ఆ మెషిన్ కి పక్కన పెడతాడు. కానీ కొన్ని ఊహించని కారణాలతో తాను కూడా ఆ యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. ఇక ఈ తర్వాత టాబ్బీ మిస్ అవుతారు. అలా మిస్ అయ్యిన తాను దొరికారా లేదా? తనకి ఏమయ్యింది? అతను ఎందుకు ఆ మెషిన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. చివరికి అక్షయ్ తన విషయంలో ఎలాంటి నిజాన్ని కనుగొన్నారు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఇటీవల బాలీవుడ్ సినిమా నుంచి పలు నిజ జీవిత సంఘటనలు ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాల్లో ఈ స్కై ఫోర్స్ కూడా ఒకటి. మన భారత దేశ భద్రతా దళాల్లో ఒకటైన వాయు దళంలో జరిగిన ఒక యదార్ధ ఘటనని కళ్ళకి కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించారని చెప్పవచ్చు.

మెయిన్ గా ఆ విమాన యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలో అదిరాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే అబ్బురపరిచేలా స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కించారు. అలాగే వీటితో పాటుగా పలు కీలక సన్నివేశాల తాలూకా ఎమోషన్స్ బాగా పండాయి. ఇంకా దేశభక్తి అంశాలు కూడా ఈ సినిమాలో ప్లస్ అని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలో మెయిన్ హీరో అక్షయ్ కుమార్ ఉన్నప్పటికీ తనతో పాటుగా వీర్ పహార్య కూడా షైన్ అయ్యారని చెప్పవచ్చు. తన పాత్రలో పర్ఫెక్ట్ గా తాను సెట్ అయ్యి సాలిడ్ పెర్ఫామెన్స్ ని ఈ చిత్రంలో కనబరిచారు. అలాగే అక్షయ్ కూడా సాలిడ్ రోల్ లో కనిపించారు. తనపై వైమానిక సన్నివేశాలు కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఇంకా సారా అలీ ఖాన్ మంచి పాత్రలో కనిపించింది. వీరితో పాటుగా శరద్ కేలేకర్ ఇతర నటీనటులు మంచి నటన కనబరిచారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం పలు యధార్థ ఘటనలు ఆధారంగా తెరకెక్కించినప్పటికీ ఇంకా కొంచెం గ్రిప్పింగ్ గా కథనం నడిపించి ఉంటే బాగుండేది. కొన్ని మూమెంట్స్ మంచి హై ఇస్తాయి కానీ కొన్ని మూమెంట్స్ అక్కడక్కడా స్లో గా కొనసాగినట్టుగా అనిపిస్తుంది. దీనితో చిత్రం ఇంకొంచెం ఎంగేజింగ్ గా నడిపే స్కోప్ ని మిస్ చేసారని చెప్పవచ్చు. అలాగే సెకండాఫ్ లో లాస్ట్ 25 నిమిషాలకి వచ్చే వరకు అలా కథనం కొంచెం నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. అలాగే కొన్ని పాటలు ఫ్లోలో ఎమోషన్ తో బానే ఉన్నాయి కానీ ఇంకొన్ని కట్ చేయాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయని చెప్పవచ్చు. మెయిన్ గా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఇంకా బెటర్ గా చేసి ఉంటే మరింత బాగుండేది కానీ విజువల్స్ మాత్రం ఈ సినిమాలో మెప్పిస్తాయి. అలాగే సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకులు సందీప్, అభిషేక్ ల విషయానికి వస్తే.. మంచి ఎమోషనల్ అండ్ దేశభక్తి కథాంశం వారు తీసుకున్నారు. దీనిని చాలా వరకు బాగానే నడిపించారని కూడా చెప్పవచ్చు. కాకపోతే కొన్ని చోట్ల ఇంకా ఇంట్రెస్టింగ్ గా కథనం తీసుకెళ్లాల్సింది. మరింత గ్రిప్పింగ్ నరేషన్ ని తీసుకోవాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “స్కై ఫోర్స్” చిత్రం థియేటర్స్ లో ఒకింత ఫెయిల్ అయినప్పటికీ ఎలాంటి అంచనాలు లేకుండా ఓటిటిలో ట్రై చేస్తే మెప్పిస్తుంది అని చెప్పవచ్చు. మంచి యాక్షన్, గ్రాండ్ విజువల్స్ అలానే డీసెంట్ ఎమోషన్స్ కోరుకునేవారు ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు. కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో ఈ చిత్రాన్ని ఒకసారికి చూడవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు