రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది స్టార్ హీరో అక్షయ్ కుమార్ అలాగే యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ల కలయికలో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన చిత్రం “బడే మియా చోటే మియా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం భారీ యాక్షన్ డ్రామాగా వచ్చింది కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సినిమాలో కంటెంట్ లేకపోయేసరికి విఫలం అయ్యింది.
అయితే ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ జూన్ 6 నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు తెలిపారు. చెప్పినట్టే ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మానుషీ చిల్లర్, అలయ ఎఫ్ తదితరులు నటించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి