ఖాన్ ల ఆధిపత్యానికి గండి కొడుతున్న అక్షయ్ కుమార్.

Published on Aug 8, 2020 8:26 pm IST

ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో అక్షయ్ కుమార్, దీపికా పదుకొనె మొదటి స్థానంలో నిలిచారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో అక్షయ్ కుమార్ 24 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఇక హీరోయిన్స్ కేటగిరీలో 14 శాతం ఓట్లతో దీపికా పదుకొనె మొదటి స్థానం దక్కించుకుంది. యంగ్ స్టార్ హీరోలను కాదని అక్షయ్ తరువాత అమితాబ్ రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. 23శాతం ఓట్లతో అమితాబ్ షారుక్, సల్మాన్ మరియు అమీర్ ఖాన్ వంటి వారిని వెనక్కి తోసి రెండవ స్థానం ఆక్రమించారు .

ఏడాదికి మూడు నుండి నాలుగు సినిమాలు చేస్తుం అక్షయ్ కుమార్, ఖాన్ త్రయానికి కూడా షాక్ ఇస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అత్యధిక ఆదాయం కలిగిన సెలెబ్రిటీల ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా అక్షయ్ కుమార్ మాత్రమే మెరుగైన రేటింగ్ తో ముందు ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఖాన్ ల అధిపత్యానికి అక్షయ్ కుమార్ గండి కొడుతున్నాడు.

సంబంధిత సమాచారం :

More