రాహుల్ రవీంద్రన్ ,వెన్నెల కిషోర్ ,షాని సాల్మన్ ,భానుశ్రీ మెహ్రా ,ఖుషి ,హోభా పటేల్ లీడ్‌రోల్స్‌లో అశోకా క్రియేషన్స్ పతాకంపై అశోక వర్దన్ నిర్మిస్తోన్న చిత్రం అలా ఏలా..ముప్పా వెంకయ్య చౌదరి సమర్పకులు.అనీష్ కృష్ణ దర్శకుడు. నిర్మాంణాంతర కార్యక్రమాలను జరుపుకొన్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్దమయింది.
నిర్మాత అశోక్ మాట్లాడుతూ…ప్రేమ ,స్నేహం,వినోదం ప్రదానాంశాలుగా అద్యంతం ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చెసేలా తెరకెక్కిన చిత్రం అలా ఏలా.. తాజా కధ,కధనాలకు తోడు కలర్‌ఫుల్ లొకెషన్స్‌లో తీసిన ఈ సినిమాను టెక్నికల్‌గా ,విజువల్‌గా దిబెస్ట్ అనేలా దర్శకుడు రూపొందించాడు.ఈ నెల 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ..నేటి జనరేషన్తోపాటు,ఫ్యామిలీ ఆడియెన్స్ను కూడా ఆకట్టుకునేలా ఓ కంప్లీట్ క్లీన్ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్గా అలా ఏలా సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తున్నాము.భీమ్స్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ లబిస్తోంది.సాయి శ్రీరామ్ సినిమాటోగ్రపి ఆకట్టుకుంటుంది.ఓవరాల్‌గా ఓ చక్కని ఫన్,ఫీల్‌ను కోరుకునే ప్రేక్షకులకు అలా ఏలా 100% శాటిస్‌ఫై చెస్తుందని అన్నారు.
మురళిమోహన్ ,కొండవలస,కృష్ణ భగవాన్,రాళ్లపల్లి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సాయి శ్రీరామ్.