అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటిరోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను నమోదు చేసిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. పైగా నాన్ బాహుబలి రికార్డ్స్ ను కూడా కొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో బన్నీ టీమ్ చిత్ర బృందానికి అలాగే కొంతమంది సినీ ప్రముఖులకు పార్టీని ఏర్పాటు చేసింది.
కాగా ఈ వేడుకకు సినిమా టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు లేటెస్ట్ డైరెక్టర్స్ లో చాలమంది ఈ సెలెబ్రేషన్స్ కు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి బన్నీ తాజాగా పోస్ట్ చేస్తూ.. లెజెండ్ డైరెక్టర్ నుండి లేటెస్ట్ డైరెక్టర్స్ వరకూ అని వారితో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు.
అలాగే వారిని ఉద్దేశించి టెస్ట్ పోస్ట్ చేస్తూ.. ‘ఇంటికి వచ్చి మా వేడుకల్లో భాగమైనందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సెలెబ్రేషన్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనదే.. అయితే మీ రాకతో ఈ సెలెబ్రేషన్స్ ను నాకు మరింతగా గుర్తుండిపోయేలా చేశారు. మీ అందరికీ నా ధన్యవాదాలు’. అని బన్నీ మెసేజ్ చేశారు.