బన్నీ టీజర్ తో వచ్చేస్తున్నాడు…!

Published on Dec 11, 2019 2:28 pm IST

అలవైకుంఠపురంలో పాటల విడుదల తరువాత ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానికి చేరాయి. దీనితో అలవైకుంఠపురంలో మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ ఐనా హాట్ టాపిక్ లా మారుతుంది. కాగా నేడు ఈ చిత్ర టీజర్ విడుదల కానున్నట్లు రెండు రోజుల క్రితం చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకు ఈ చిత్ర టీజర్ విడుదల కానున్నట్లు కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ తెలియజేసింది. దీనితో బన్నీ ఫ్యాన్స్ టీజర్ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అలవైకుంఠపురంలో. బన్నీ ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కనిపిస్తాడని సమాచారం. ఇక పూజా హెగ్డే బన్నీ పనిచేసే ఆఫీస్ హెడ్ గా అతనికి లేడీ బాస్ రోల్ చేస్తున్నారు. సీనియర్ హీరొయిన్ టబు, హీరో సుశాంత్ లతో పాటు నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం :

More