పిక్ ఆఫ్ ది డే : బాలయ్య, మోక్షజ్ఞ్యతో అలేఖ్య తారకరత్న బ్యూటిఫుల్ పోస్ట్

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి చిన్న బ్రేక్ ఇచ్చి బాలయ్య ఎలక్షన్ మూడ్ లోకి వచ్చి ప్రచారం చేస్తుండగా ఒక బ్యూటిఫుల్ పిక్ ఒకటి బయటకి వచ్చింది.

దివంగత నటుడు నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య తారకరత్న తన అందమైన కుటుంబం కలిసి బాలయ్య అలాగే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ్య లతో కలిసి ఒక పిక్ ని షేర్ చేశారు. మరి ఇందులో అంతా ఎంతో ఆహ్లాదంగా చిరు నవ్వుతో కనిపిస్తూ ఉండగా ఈ పిక్ ఇపుడు నందమూరి అభిమానుల్లో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ గా మారింది.

మరి ఆమె పోస్ట్ లో తాను ఎటు వైపు ఉంటాను అని అడిగితే ఖచ్చితంగా తన కుటుంబం వైపే ఉంటాను అని ఎలాంటి అంశాలు ఆశించకుండా మా మామయ్య గారికి విష్ చేస్తున్నాని అని ఈ ఫోటో షేర్ చేయడంతో ఇది పిక్ ఆఫ్ ది డే గా మారింది.

Exit mobile version