ఆర్ఆర్ఆర్ పై వస్తున్న ఆ వార్త అధికారికమేనట..!

ఆర్ఆర్ఆర్ పై వస్తున్న ఆ వార్త అధికారికమేనట..!

Published on Mar 20, 2020 8:59 AM IST

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ పై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొనివుంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ నుండి ఆమె వెళ్లిపోవడం అధికారికమే అని తెలుస్తుంది. బాలీవుడ్ లో రెండు మూడు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న అలియా భట్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఇక ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ ఏప్రిల్ నెలలో మొదలు కానుంది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తుండగా,2021 జనవరి 8న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు