బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న బ్యూటీ ఆలియా భట్. ఇటు టాలీవుడ్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక ఆలియా భట్ నటించిన రీసెంట్ మూవీ ‘జిగ్రా’ పలు భాషల్లో రిలీజ్ అయింది. అక్టోబర్ 11న ఈ మూవీని గ్రాండ్ స్కేల్లో రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను వాసన్ బాల డైరెక్ట్ చేశాడు.
అయితే, మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న స్థాయిలో అలరించ లేకపోయింది. దీంతో ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఆలియా పర్ఫార్మెన్స్కు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘జిగ్రా’ చిత్ర ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
దీంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ 6 నుండి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు రాబోతున్నట్లు టాక్. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.