బ్రహ్మాస్త్ర 2 లో ఈ స్టార్ నటించాలని కోరుకుంటున్న అలియా?

Published on Sep 23, 2022 2:21 am IST


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర విడుదలైన తర్వాత కూడా ప్రమోషన్‌ లో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో అలియా మాట్లాడుతూ, ఈ చిత్రం రెండవ భాగంలో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

దీపిక మొదటి భాగంలో అతిధి పాత్రలో కనిపించింది. మరియు రెండవ భాగంలో ఆమె ఏ పాత్ర చేస్తుందో తెలియాలంటే వేచి చూడాలి. అయాన్ ముఖర్జీ ఇప్పటికే రెండవ భాగం కోసం సన్నాహాలు ప్రారంభించాడు. వార్తల ప్రకారం ఈ రెండవ భాగంలో చాలా మంది ప్రముఖ ముఖాలు కనిపిస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

సంబంధిత సమాచారం :