“ఆదిపురుష్” అసలు నిజం కోసం కూడా అంతా వెయిటింగ్.!

“ఆదిపురుష్” అసలు నిజం కోసం కూడా అంతా వెయిటింగ్.!

Published on Mar 30, 2023 11:00 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భారీ పాన్ ఇనియా సినిమా గా వస్తున్న భారీ ఇతిహాస సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. అయితే రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ మాసివ్ విజువల్ డ్రామా కోసం అయితే ఛాయా మంది ఎదురు చూస్తున్నారు.

కానీ మొదట టీజర్ తో మాత్రం మేకర్స్ అంచనాలు తలకిందులు చేశారు. దీనితో రెండో సారూ అప్డేట్ చేసిన అవుట్ పుట్ కోసం ఎగ్జైట్మెంట్ పెరిగింది. అయితే ఈ భారీ సినిమా నుంచి నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఓ అమూల్యమైన పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా దీనికి కాస్త పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చాలా మంది నుంచి వచ్చింది. అయితే ఈ పోస్టర్ కూడా సరిపోలేదని మూవీ లవర్స్ అంటున్నారు.

మరి ఈ సినిమా నుంచి వీడియో టీజర్ లాంటిది ఏమన్నా వస్తే తప్ప నమ్మలేం అన్నట్టుగా అంటున్నారు. దీనితో అసలు నిజం కోసం చాలా మంది ఎదురు చూస్తూ సినిమాకి తాము పెట్టుకున్న అంచనాలు ఉంచుకోవాలా వద్దా అనేది ఆసక్తిగా మారింది. మరి మేకర్స్ అయితే ఈసారి ఏం చేసారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు