రియల్ “గేమ్ ఛేంజర్” స్పీచ్ కోసం అంతా వెయిటింగ్

రియల్ “గేమ్ ఛేంజర్” స్పీచ్ కోసం అంతా వెయిటింగ్

Published on Jan 4, 2025 3:43 PM IST

మళ్ళీ చాలా కాలం తర్వాత మెగా అభిమానులకి నేడు బిగ్ డే అని చెప్పొచ్చు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన అవైటెడ్ భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” సినిమా మంచి హైప్ ని సెట్ చేసుకొని సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ చిత్రంకి సంబంధించి నేడు భారీ ఈవెంట్ ని రాజమండ్రిలో ప్రీ రిలీజ్ గా చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కోసం రియల్ గేమ్ ఛేంజర్ ఏపీ డిప్యూటీ సీఎం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తుండడంతో భారీ అంచనాలు సెట్ అయ్యాయి.

మరి చాలా కాలం తర్వాత పవన్ హాజరు అవుతున్న సినిమా ఈవెంట్ కూడా ఇదే కావడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్ పట్ల మంచి ఆసక్తి నెలకొంది. చరణ్ కోసం అలాగే మెయిన్ గా దర్శకుడు కోసం ఇంకా ఇది సోషల్ సబ్జెక్టు కావడంతో ఎలాంటి కొత్త విషయాలు తాను పంచుకుంటారు అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి పవన్ ఏ రేంజ్ స్పీచ్ ఇస్తారో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు