మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్స్ మీనాక్షి చౌదరి మరియు శ్రీలీల లు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం”. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంలో మహేష్ చాలా కాలం తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో కనిపిస్తున్నాడు. దీనితో ఫ్యాన్స్ అంతా ఎంతో హైప్ తో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు అంతా సినిమా నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సెకండ్ సింగిల్ ని కన్ఫర్మ్ చేశారు కానీ ఈ రెండో వారంలో ఇంకా మెకాన్ నుంచి ఎలాంటి మూమెంట్ లేకపోవడం ఇంకా సినిమా రిలీజ్ సమయం కూడా దగ్గరకి వస్తుండడంతో అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ తొందరపడుతున్నారు. మరి ఈ సాంగ్ పై అప్డేట్ ఈ వీక్ లో ఎప్పుడైనా వస్తుందేమో చూడాలి.