ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు కావున నిన్న సాయంత్రం నుంచే సినీ ప్రముఖులు బన్నీ కి బర్త్ డే విషెస్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక ఈరోజు బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ అన్ని ప్రాజెక్ట్ లలో సెన్సేషనల్ కలయిక దర్శకుడు అట్లీతో ప్రాజెక్ట్ కోసం మరింత హైప్ నెలకొంది.
గత కొన్నాళ్ల నుంచి ఊరిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు కూడా ఓ రేంజ్ లో హింట్స్ ఇస్తూ వస్తున్నారు. మరి ఫైనల్ గా నేడు రానే వచ్చింది. దీనితో అందరి కళ్ళు ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్మెంట్ పైనే పడ్డాయి. దాదాపు వీరి కాంబినేషన్ అనే ఫిక్స్ అయ్యారు. కానీ ఎలా ఉండబోతుంది ఈ అప్డేట్ అనేది మంచి ఆసక్తి రేపుతోంది. మరి చూడాలి ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది.