Vishwambhara: “విశ్వంభర” ట్రీట్ పైనే అందరి కళ్ళు


లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారీ ట్రీట్ టీజర్ ని ఈ దసరా మహోత్సవం కానుకగా మేకర్స్ మెగాస్టార్ పై క్రేజీ పోస్టర్ తో కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు ఈ ట్రీట్ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత చిరు చేసిన ఫాంటసీ వండర్ ఇది కావడమే ఇందుకు కారణం అని చెప్పాలి.

దీనితో అందరి కళ్ళు విశ్వంభర మీదే పడ్డాయి. మరి చూడాలి నేడు వచ్చే టీజర్ ఎలాంటి ట్రీట్ అందిస్తుంది అనేది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version