అందరి కళ్లు “దేవర” ట్రైలర్ పైనే!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసారు. ఈ చిత్రం ట్రైలర్ ను నేడు సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. యంగ్ టైగర్ ను పవర్ ఫుల్ దేవర రోల్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కాకుండానే, ఒక పక్క నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ మిలియన్ డాలర్ల తో దూసుకు పోతున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయితే ఇక ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పాలి. రిలీజైన ప్రచార చిత్రాలు, పాటలు, గ్లింప్స్ వీడియోలకి సెన్సేషన్ రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ అంతకు మించి ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ అధ్బుతమైన సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version