“గేమ్ ఛేంజర్” ట్రైలర్ పైనే అందరి కళ్ళు.. గేర్ ఛేంజ్ చేస్తుందా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే హీరోయిన్ అంజలి కలయికలో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం తెలిసిందే. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాపై హైప్ ఇప్పుడు ఇంకా పెరుగుతూ వస్తోంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటలు అన్నీ ప్రమోషనల్ కంటెంట్ లు ఆకట్టుకున్నాయి. కానీ నేడు బిగ్ డే ట్రైలర్ డే కావడంతో అందరి కళ్ళు దీనిపై పడ్డాయి.

అయితే గేమ్ ఛేంజర్ ట్రైలర్ ని మేకర్స్ నేడు ఎస్ ఎస్ రాజమౌళితో లాంచ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ ఖచ్చితంగా పెద్ద మ్యాజిక్ చేస్తే కానీ పాన్ ఇండియా లెవెల్లో ఊపు మార్చేలా లేదని చెప్పాలి. ఇప్పటికే నేషనల్ వైడ్ ప్రమోషన్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి. దీనితో నేడు వచ్చే ట్రైలర్ మాత్రం డెఫినెట్ గా పెద్ద ఇంపాక్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. మరి చూడాలి నేటి సాయంత్రం వచ్చే ట్రైలర్ ఎలా ఉంటుందో అనేది.

Exit mobile version