ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర: పార్ట్ 1. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఐతే, ఈ సాయంత్రం, హైదరాబాద్ లోని నోవాటెల్‌ లో దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. బ్లాక్‌ బస్టర్ ఆర్ఆర్ఆర్ వచ్చిన రెండేళ్ల తర్వాత మళ్లీ ఎన్టీఆర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.

మరి ఈ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ?, చాలా కాలం తర్వాత తారక్ ప్రసంగాన్ని అభిమానులు వినబోతున్నారు. అందుకే, ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ప్రత్యేకించి ఆసక్తిగా చూపిస్తున్నారు. ఇక ఈ వేడుకలో అనిరుధ్ రవిచందర్ ప్రత్యక్ష ప్రదర్శన ఉండబోతుంది. కాగా ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మరియు షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. మరి పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తోందో చూడాలి.

Exit mobile version