ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి ?

ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి ?

Published on Dec 1, 2024 10:58 AM IST


‘పుష్ప 2 ది రూల్’ సినిమా రాకకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో, అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే, తెలంగాణ ప్రభుత్వం, ఈ చిత్రం టికెట్ ధరలను అనూహ్యంగా పెంచడానికి అనుమతులు ఇచ్చింది. ఐతే, ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ‘దేవర’ టికెట్ రేట్ల కంటే ఎక్కువ టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వానికి – చిత్ర నిర్మాతలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2 ది రూల్’ సినిమా టికెట్ రేట్లు ఏ స్థాయికి పెరుగుతాయో చూడాలి. టికెట్ ధరల పెంపు అనేది, బాక్సాఫీస్ కలెక్షన్ల పై బాగా ప్రభావం చూపనుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ తో పాటు తమన్ కూడా సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు