‘మట్కా’.. అందరి చూపు వరుణ్ పైనే..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకుంటారని అభిమానులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ఇప్పుడు అందరి చూపులు వరుణ్ తేజ్ పైనే ఉన్నాయని చెప్పాలి.

టాలీవుడ్‌లో ఎలాంటి పాత్రనైనా పర్ఫెక్షన్‌తో చేసే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. తనకు వచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసే హీరోల్లో వరుణ్ తేజ్ కూడా ఒకరు. కంటెంట్ ఉన్న సినిమాల్లో హీరోగా తనలోని యాక్టింగ్ స్కిల్స్‌తో ఎలివేట్ అయ్యేలా వరుణ్ తేజ్ ప్రయత్నిస్తుంటాడు. గతంలో ‘గద్దలకొండ గణేష్’ వంటి సినిమాలో ఆయనలోని నటుడికి చాలా మంచి రెస్పాన్స్ లభించింది. ఆ తరువాత ఆ స్థాయిలో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ కనిపించలేదని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇక ఇప్పుడు ‘మట్కా’ చిత్రంలో మరోసారి వరుణ్ తేజ్ తనలోని నటుడిని బయటకు తీసుకొస్తాడని వారు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో విభిన్నమైన లుక్స్‌తో వరుణ్ కనిపిస్తుండటంతో, ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ పరంగా ఆకట్టుకుంటాడని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా జివి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version