స్టార్ హీరోల అభిమానులంతా ‘దసరా’ను మార్క్ చేసి పెట్టుకోండి

Published on Sep 23, 2020 3:00 am IST


సినిమా హాళ్లు మూతబడటంతో గత ఐదారు నెలలుగా సినీ లవర్స్ చాలా బోర్ ఫీలవుతున్నారు. చిత్రీకరణలు ఆగిపోవడంతో తమ అభిమాన హీరోల కొత్త సినిమాల నుండి ఎలాంటి అప్డేట్స్ రాక ఫ్యాన్స్ విలవిల్లాడిపోతున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఒక్కొక్క స్టార్ హీరో బయటికొస్టున్నారు. పెద్ద సినిమాలు సెట్స్ మీదకి వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. త్వరగా షూటింగ్స్ జరిపి సినిమాల గురించిన అప్డేట్స్ వరుసగా ఇవ్వాలని అడుగుతున్నారు. కొందరైతే తమ బాధనుa కూడ అర్థం చేసుకుని మేకర్స్ ఏదో ఒక ఫీడ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

దర్శక నిర్మాతలకు, హీరోలకు అభిమానుల బాధ తెలుసు కాబట్టి గట్టిగా అప్డేట్స్ ఇవ్వాలనే ప్లాన్స్ వేసుకుంటున్నారట. దాదాపుగా అందరూ రానున్న దసరా పండుగను వేదికగా చేసుకుంటున్నారు. రాజమౌళి ఏమో దసరాకైనా ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఎన్టీఆట్ టీజర్ వదలాలని అనుకుంటుండగా చిరు, కొరటాల శివలు ‘ఆచార్య’ టీజర్ ను దసరాకే ప్లాన్ చేస్తున్నారట. అలాగే నాగర్జున చేస్తున్న ‘వైల్డ్ డాగ్’ టీజర్ సైతం దసరాకే అంటున్నారు. ప్రభాస్, రాధాకృష్ణల ‘రాధేశ్యామ్’ టీజర్ కూడ దసరా కానుకగానే రావచ్చట. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ టీజర్ సైతం దసరా పండుగకే వస్తుంది.

ఇక కొత్తగా మొదలయ్యే పరశురాం, మహేష్ బాబుల ‘సర్కారువారి పాట’, బోయపాటి శ్రీను, బాలయ్య సినిమాల నుండి ఏదైనా అప్డేట్ దసరాకే ఉండొచ్చు. రవితేజ ‘క్రాక్’, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, అఖిల్ యొక్క ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’‌, నాని చేస్తున్న ‘టక్‌ జగదీష్’‌, సాయితేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల టీజర్స్ కూడ విజయదశమినాడే విడుదలకావచ్చు. సో.. ఈ దసరా పండుగను అందరు హీరోల అభిమానులకు మార్క్ చేసి పెట్టుకోవాలన్నమాట.

సంబంధిత సమాచారం :

More