“దేవర” నుంచి ఫైనల్ గా మరో ట్రీట్ కి రంగం సిద్ధం

“దేవర” నుంచి ఫైనల్ గా మరో ట్రీట్ కి రంగం సిద్ధం

Published on Jul 27, 2024 1:03 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “దేవర”. మరి ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా కొరటాల అలాగే ఎన్టీఆర్ ల కలయికలో ఇది రెండో సినిమాగా వస్తుండడంతో మంచి హైప్ నెలకొంది.

అలాగే సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ ఫియర్ సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా దీని తర్వాత నెక్స్ట్ సాంగ్ ఎప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దేవర సాంగ్ పై అప్డేట్ ఈ వారంలోనే ఉంటుంది అని ఆల్రెడీ మేము తెలియజేశాము. మరి ఫైనల్ గా దీనిపై ఆడియో లేబుల్ సంస్థ టి సిరీస్ వారు ఇప్పుడు హింట్ ఇచ్చారు.

ఈసారి దేవర నుంచి ఒక లవ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సో దేవర నుంచి రెండో సాంగ్ కి కూడా మొత్తం సిద్ధం అవుతుంది అని చెప్పాలి. అలాగే ఈ సాంగ్ పై మరింత క్లారిటీ ఈ కొన్ని రోజుల్లోనే రానుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు