మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ (మెగా 157) రాబోతుంది. ఐతే, ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఆసక్తికి నేడు క్లారిటీ వచ్చింది. కాగా ఈ రోజు ‘మెగా 157’ పూజా కార్యక్రమంతో నటీనటులు మరియు చిత్ర సిబ్బంది మధ్య లాంచ్ కాబోతుంది.
విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. కాగా త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా గురించి ఆ మధ్య మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు ఆల్ రెడీ చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.