తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేసిన అల్లరి నరేష్!

టాలీవుడ్ నటుడు, అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ నేడు బచ్చల మల్లి నుండి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో లో అల్లరి నరేష్ మాస్ పాత్రలో కనిపించాడు. ఈ వీడియో కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుబ్బు మంగ‌దేవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఇప్పుడు నిర్మాణ ద‌శ‌లో ఉంది. బచ్చల మల్లి యొక్క గ్లింప్స్ విడుదలతో పాటు, ఈ ప్రత్యేక రోజున నరేష్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి తాత్కాలికంగా AN63 అని పేరు పెట్టారు. మెహర్ తేజ్ ఈ చిత్రంకి దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. అతను గతంలో సుహాస్ నటించిన ఫ్యామిలీ డ్రామా అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. అది డైరెక్ట్ సోనీ LIVలో విడుదలైంది. AN63 యొక్క అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సినిమా గురించి కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని డీకోడ్ చేయమని నరేష్ ప్రేక్షకులను కోరారు.

Exit mobile version