మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి టాలెంటెడ్ హీరోస్ లో అల్లరి నరేష్ కూడా ఒకరు. కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా తాను చేస్తుండగా అలా తాను నటించిన లేటెస్ట్ సినిమానే “బచ్చల మల్లి”. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు మంగదెవ్వి తెరకెక్కించిన ఈ చిత్రం గత డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. అయితే నటుడుగా అల్లరి నరేష్ మరోసారి అలరించగా సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.
ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి అయితే ఇపుడు రెడీ అయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులు మొత్తం మూడు సంస్థలు తీసుకోగా అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ అలాగే ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా లేటెస్ట్ గా ఈటీవీ విన్ వారు అయితే డేట్ ని ఇచ్చేసారు. రేపు జనవరి 10 నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఈటీవీ విన్ లో చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.