ఇంటెన్స్ గా అల్లరి నరేష్ “బచ్చల మల్లి” టీజర్ గ్లింప్స్


టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అల్లరి నరేష్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “ఆ ఒక్కటీ అడక్కు” చిత్రంతో డీసెంట్ రెస్పాన్స్ ని అందుకున్నాడు అయితే ఇది కామెడీ జానర్ లో వచ్చినప్పటికీ ఇలాంటి సినిమాలతో పాటుగా అల్లరి నరేష్ మంచి ఇంటెన్స్ చిత్రాలు కూడా చేస్తున్నాడు. అలా చేస్తున్న మరో సాలిడ్ చిత్రమే “బచ్చల మల్లి”.

మరి దర్శకుడు సుబ్బు మంగదెవ్వి ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించగా అల్లరి నరేష్ సాలిడ్ మేకోవర్ లోకి ఈ సినిమా కోసం ప్రిపేర్ చేసాడు. ఇప్పటికే తన ఫస్ట్ లుక్ ఇతర పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ రాగా వీటి తర్వాత అయితే ఈరోజు తన బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఉందని చెప్పాలి.

మెయిన్ గా అల్లరి నరేష్ లుక్ కానీ తన బాడీ లాంగ్వేజ్ చాలా బాగున్నాయి. బచ్చల మల్లి గా నరేష్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిపోయాడు. ఇక ఈ గ్లింప్స్ లో విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన స్కోర్ కూడా బాగుంది. ఇక ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా హాస్య మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version