‘12A రైల్వే కాలనీ’తో భయపెట్టేందుకు సిద్ధమైన అల్లరి నరేష్

‘12A రైల్వే కాలనీ’తో భయపెట్టేందుకు సిద్ధమైన అల్లరి నరేష్

Published on Mar 17, 2025 5:05 PM IST

కామెడీ చిత్రాలతో తనదైన ఇమేజ్ తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్, ఇటీవల కాలంలో తన పంథా మార్చుకున్నాడు. వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ హీరో, మంచి విజయాలను కూడా అందుకుంటున్నాడు. ఇక అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు మేకర్స్.

అల్లరి నరేష్ ప్రస్తుతం ‘12A రైల్వే కాలనీ’ అనే ఓ హార్రర్ జోనర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పొలిమేర, పొలిమేర-2 చిత్రాల దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ స్టైలిష్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్పిరిట్స్, ఆత్మలు కొందరికి ఎలా కనిపిస్తాయి.. అనే పాయింట్‌తో ఈ టైటిల్ టీజర్ ప్రారంభంలో చూపెట్టారు.

ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ ప్రేక్షకులను పూర్తిగా భయపెట్టడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు