ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రంతో అల్లరి నరేష్ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గిరిజన ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ఎన్నికల అధికారిగా నరేష్ నటించాడు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది కథానాయిక గా నటిస్తుంది. ఈ విలేజ్ డ్రామాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ మోహన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.