నాగ చైతన్య తండేల్ చిత్రంలో అద్భుతంగా నటించాడు – అల్లు అరవింద్

నాగ చైతన్య తండేల్ చిత్రంలో అద్భుతంగా నటించాడు – అల్లు అరవింద్

Published on Jan 28, 2025 10:00 PM IST

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి నాగచైతన్య, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ చిత్రాన్ని చాలా కష్టపడి తీశామని.. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి తమ కష్టానికి తగిన ఫలితాన్ని అందించాలని కోరారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. ఈ సినిమాతో చైతూ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకుంటాడని.. సాయి పల్లవి కూడా చాలా అద్భుతంగా నటించిందని.. దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని ఆయన అన్నారు.

ఇక ఈ సినిమా కథను శ్రీకాకుళంలో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించినట్లు.. ఉత్తరాంధ్ర వారికి ఈ సినిమా మరింతగా నచ్చుతుందని అల్లు అరవింద్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు