ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న్ నటించిన ‘పుష్ప-2’ చిత్ర ప్రీమియర్స్ సమయంలో జరిగిన విషాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై అల్లు అర్జున్ తాజాగా మరోసారి స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, తనకు ఈ ప్రమాదంతో చాలా బాధ కలిగిందని.. అయినా కూడా తనపై ఇలా నిందలు వేయడం సరికాదని ఆయన తెలిపారు.
అయితే, తన కొడుకు ఈ ఘటనపై ఎలా బాధపడుతున్నాడో అల్లు అరవింద్ కూడా వివరించే ప్రయత్నం చేశారు. పుష్ప-2 వంటి పెద్ద సినిమా చేసినా, ఆ సినిమాకు దక్కుతున్న ఆదరణను అల్లు అర్జున్ చూడలేకపోతున్నాడు. ఈ సినిమా సక్సె్స్‌ను ఇతరులతో కలిసి తను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అతడు ఇంటి గార్డెన్‌లో ఓ మూలన కూర్చుంటున్నాడు.
ఇలా జరగాలని మనం కోరుకోకపోయినా, మన సినిమాకు ఇలా జరగడంతో తాను ఇలా ఉంటున్నానని అర్జున్ తెలిపాడని అల్లు అరవింద్ ఉద్వేగంగా పేర్కొన్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్‌కి ఉన్న న్యాయపరమైన పరిమితులను గమనించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.