బన్నీ కూడా ఇంట్రస్ట్ గా ఉన్నాడట !

Published on Jul 4, 2020 11:05 pm IST

డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగాస్టార్ తో భారీ సినిమా ‘సైరా’ తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్నారని, లేదూ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తరువాత అల్లు అర్జున్ తో చేస్తున్నాడని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, సురేందర్ రెడ్డి ఇప్పటికే బన్నీకి ఓ స్క్రిప్టు వినిపించినట్లు తెలుస్తోంది. బన్నీ కూడా సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఓ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా ఉండనుందని.. ముఖ్యంగా అల్లు అర్జున్ కు సరిపడే స్టోరీతో సురేందర్ రెడ్డి ఈ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట. మరి సురేందర్ రెడ్డి – బన్నీ కలయిక పై క్లారటీ వచ్చేదాకా ఈ సినిమా గురించి ఫుల్ డిటైల్స్ తెలియవు. బన్నీ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More